
జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తా…
ఎపి డబ్ల్యూ జె ఎఫ్ ప్రతినిధి బృందానికి చెల్లుబోయిన గోపాలకృష్ణ హామీ…
అమరావతి, ఏప్రిల్ 13, (సీమకిరణం న్యూస్) :
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు చెల్లుబోయిన గోపాలకృష్ణ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రతినిధి వర్గం ఈరోజు ఆయనను కలిసి జర్నలిస్టుల సమస్యల గురించి వివరించింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ఇప్పటికీ పూర్తికాని అక్రిడిటేషన్ ల జారీ, జర్నలిస్టుల సంక్షేమ సంక్షేమానికి తీసుకోవలసిన చర్యలతో పాటు చిన్న పత్రికలకు ప్రకటనలు జారీ చేసే విషయంలో చొరవ చూపించాలని ఫెడరేషన్ ప్రతినిధి వర్గం సమాచార శాఖ మంత్రికి వివరించారు. దానికి ఆయన స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ అని చెబుతూ తప్పనిసరిగా ఆ హామీని అని స్పష్టం చేశారు. ప్రతినిధి వర్గంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు, నగర ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు కే కలిమి శ్రీ, ఎం బి నాదం, వలి, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా కన్వీనర్ అలీమ్, శ్యాం లు ఉన్నారు. మంత్రిని కలిసిన ప్రతినిధివర్గం తొలుత పుష్పగుచ్చం తో ఆయనను పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని అభినందనలు తెలియజేశారు.
జి ఆంజనేయులు
ప్రధాన కార్యదర్శి
ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్