
ఎమ్మిగనూరు ఐ న్యూస్ రిపోర్టర్ సాయి శ్రీనివాస్ ఆకస్మిక మృతి
సంతాపం తెలిపిన..జర్నలిస్టులు
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 13, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు పట్టణంలో ఐ న్యూస్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న సాయి శ్రీనివాస్ నింటిరోజు రాత్రి అనారోగ్యంతో
మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీనియర్ జర్నలిస్టుల కె ఎం డి.ఫారూఖ్, శరత్,ఎస్ కె.షబ్బీర్, గిప్సన్, అబ్దుల్ రజాక్,బి. ప్రసాద్,చంద్రశేఖర్, మకబుల్ ,అశోక్,సీనియర్ జర్నలిస్టులు ,తదితరులు పాల్గొని ఆయన భౌతికాయన్ని సందర్శించి పూలమాలలు వేసి సంతాపం తెలిపి,నివాళులు అర్పించారు ఈ సందర్భంగా A.P.J.F తాలూకా అధ్యక్షులు KMD ఫరూక్ మాట్లాడుతూ జర్నలిస్ట్ కుటుంబంలో నుంచి ఒక సభ్యులు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చిపరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.