పాత్రికేయ సమాజానికి మంత్రి క్షమాపణ చెప్పాలి.. ఎపిడబ్ల్యుజెఎఫ్
నంద్యాల టౌన్, ఏప్రిల్ 13, (సీమకిరణం న్యూస్) :
పాత్రికేయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ మాట్లాడడం దివాలా కోరుతనానికి నిదర్శనమని నంద్యాల నియోజకవర్గ ఎపిడబ్ల్యుజెఎఫ్ నంద్యాల నియోజకవర్గం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు శివ, జగన్ మోహన్ లు బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. ప్రజా సంక్షేమం , సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే ప్రజాప్రతినిధులను పత్రిక సమాజం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని , అభిమానిస్తుందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే ఆరా తీయొద్దు..ఆరాదించండి అంటూ పేర్కొనడం దురదృష్టకరమన్నారు.పత్రికా విలేకరులు ముఖ్యమంత్రిని మనసారా ఆరాధించాలని చెప్పడం పత్రికా సమాజాన్ని అవమానపరచదమే నని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా రంగం కూడా సమాజంలో ఒక సేవారంగమేనని వారిని కూడా ఆరాధించాలని అడిగితే సమాజంలో సేవ చేసే వారు మిగలరని అన్నారు జర్నలిస్టుల ఉద్దేశించి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వారు డిమాండ్ చేశారు.సమాజం అభివృద్ధికి, ప్రజల సంక్షేమనికి కృషి చేసేవారిని ఎల్లప్పుడూ జర్నలిస్టులు ఆరాధిస్తుంటారని వారు ఆ ప్రకటనలో తెలిపారు.