పేదలకు వరం గరీబ్ కళ్యాణ్ అవాస్ యోజన
బిజేవైయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా బైరెడ్డి శబరి

పేదలకు వరం గరీబ్ కళ్యాణ్ అవాస్ యోజన
బిజేవైయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా బైరెడ్డి శబరి
నందికొట్కూరు, ఏప్రిల్ 13, (సీమకిరణం న్యూస్) :
దేశంలోని 80 కోట్ల మందికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన ఒక వరంలా మారిందని బిజేవైయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా డా.బైరెడ్డి శబరి మాట్లాడుతూ, కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. గత నెల మార్చిలో ముగియాల్సిన ఈ పథకంకు మరొకసారి రూపును ఇస్తూ సెప్టెంబర్ వరకు పొడిగించి దాదాపుగా 80 వేల కోట్లు ఖర్చు చేయడం అభినందనీయం అన్నారు. దేశంలో వుండే 5 లక్షల రేషన్ షాపుల నుండి ఎక్కడైనా రేషన్ పొందేందుకు అవకాశం కల్పించడం ఒక్క మోడీకే సాధ్యం అన్నారు. ఇప్పటివరకు దేశంలో 61 కోట్ల మందికి పైగా తమ ఇళ్ళకు దూరంగా ఉన్న లబ్దిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడం జరిగిందన్నారు.