శ్రీనివాసులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి..
శ్రీనివాసులు మృతికి సంతాపం ప్రకటించిన
ఎపి డబ్ల్యూ జె ఎఫ్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు పట్టణంలో ఐ న్యూస్ లో పనిచేస్తూ గుండె పోటుతో మృతి చెందిన వేముల శ్రీనివాసులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూ జె ఎఫ్ ) కర్నూలు జిల్లా కమిటీ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. శ్రీనివాసులు మృతికి ఫెడరేషన్ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫెడరేషన్ ఆకాంక్షించింది.జిల్లాలో జర్నలిస్టులు అనారోగ్యం బారిన పడుతూ మెరుగైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక మృతి చెందు తున్నారని ఫెడరేషన్ పేర్కొంది. ఇటీవల కాలంలో నంద్యాల లో సీనియర్ జర్నలిస్ట్ జమిని మధు గుండె పోటుతో ను, కోవెలకుంట్ల లో విశాలాంధ్రలో పనిచేస్తున్న విలేకరి శ్రీనివాసులు అనారోగ్యం తో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారని,ఇదే కోవలోనే బుధవారం ఐ న్యూస్ విలేకరి గుండె పోటుతో మృతి చెందడని ఎపి డబ్ల్యూ జె ఎఫ్ తెలిపింది. సమాజభివృద్ధిలో తమ పాత్ర పోసిస్తూ అకాల మరణం పండుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఆడుకోవాలని ఎపిడబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కమిటీ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.