అంగరంగ వైభవంగా అంబేద్కర్ విగ్రహా విష్కరణ
గజ్జహళ్ళి గ్రామంలో అంగరంగ వైభవంగా అంబేద్కర్ విగ్రహా విష్కరణ
అన్ని కులాలకు ఆదర్శం అంబేద్కర్ గ్రామ ప్రజలు పెద్ద కష్టంతో.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు..
వైస్ ఎంపీపీ మహాదేవమ్మ చేతుల మీదగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
హోళగుంద, ఏప్రిల్14, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని గజ్జహళ్ళి గ్రామంలో అంగరంగ వైభవంగా వైసీపీ మహాదేవమ్మ చేతుల మీదుగా అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.. గ్రామంలో పెద్దలు సహకారంతో యువకులు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత దళిత జాతుల ఆరాధ్య దైవం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని నెలల నుంచి అనుకున్నామని గ్రామ ప్రజల సహకారంతో మా కల నెరవేరిందని గ్రామ పెద్దలు తెలియజేశారు.. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ, దళిత సీనియర్ నాయకులు చిన్న యాత్ర శేషగిరి ఎమ్మార్పీఎస్ పార్లమెంట్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని పలు రాజకీయ పార్టీ నాయకులు ఓట్ల కోసమే దళితుల వాడుకుంటున్నారు తప్ప దళితులకు చేసిందేమీ లేదని గ్రామంలో ప్రతి దళిత నాయకుడు అంబేద్కర్ సిద్ధాంతాలను ఆశయాలను నెరవేర్చాలని వారు అన్నారు. గ్రామంలో దళితులకు అట్టడుగు వర్గాల తాము అండగా ఉంటామని రోజురోజుకు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని అంబేద్కర్ రాజ్యాంగం వల్లే దళితులకు రక్షణ ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ తనయుడు మాజీ ఎంపీటీసీ కెంచప్ప గజ్జేహాళ్ళి సర్పంచ్ తనయుడు గిరిమల్ల ఎంపిటిసి మల్లికార్జున కురువ సంఘం నాయకులు ఎల్లార్తి దర్గా అన్న, టీచర్ పాండు, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ వెంకటేష్, పకీరప్ప, గ్రామ పెద్దలు యువకులు భారీ ఎత్తున హాజరై అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేశారు..