ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి : ఆర్డీవో ఎం. దాస్.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, మహిళా పక్షపాతి :
మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా.
ఆత్మకూరు పట్టణంలో ఘనంగా 131వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.
ఆత్మకూరు టౌన్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్):
ఆత్మకూరు పట్టణంలో స్థానిక పాత బస్టాండ్ ప్రాంగణములో 131 వ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మారుఫ్ ఆసియా, మండల రెవిన్యూ అధికారి ఆర్ డి ఓ ఎం. దాస్, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస రావు, ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఇండస్ట్రీ అధికారి కె రాజమహేంద్ర నాథ్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆత్మకూరు మండల రెవెన్యూ అధికారి ఆర్డిఓ ఎం. దాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మారుఫ్ ఆసియా, ఆర్డిఓ ఎం. దాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, సమక్షంలో భారీ కేకును కట్ చేసి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఆత్మకూరు పాత బస్టాండ్ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. జై భీమ్ జై భీమ్ అంటూ నినాదాలతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈ సభకు సభాధ్యక్షులుగా రాబిన్సన్, ఆర్గనైజర్ గా మురారి చిన్న మల్లయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎం.దాస్ మాట్లాడుతూ…. భారతదేశ పౌరులందరూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిమ్న వర్గాల ఆరాధ్య దైవం అంటరానితనాన్ని రూపుమాపటకు అలుపెరుగని కృషి చేసిన యోధుడు, సామాజిక రాజకీయ న్యాయాన్ని సమానంగా అందించిన మహా నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. మునిసిపల్ చైర్మన్ మారుఫ్ ఆసియా మాట్లాడుతూ… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, మహిళా పక్షపాతి అన్నారు. కానీ కొందరు ఆయనను కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేశారని, అంబేద్కర్ అన్ని వర్గాల పీడిత ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ…. బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి ఆయన చేసిన సేవ ఎనలేనిది తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్గనిర్దేశాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమము నందు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాబిన్సన్, మాల మహానాడు నాయకులు మురహరి చిన్న మల్లయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ రాజగోపాల్, ఎస్ కే డి యూనివర్సిటీ సుదర్శన్, డాక్టర్ వెంకట స్వామి నాయక్, మల్లె ఎలీషా, జవహర్ నాయక్, శీలం శేషు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దరగయ్య, నాగశేషులు, మాలమహానాడు నాయకులు చింతలయ్య, సుధాకర్, ఏపీ గిరిజన సంఘం నాయకులు నరసింహ నాయక్, సిపిఐ నాయకులు శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బుజ్జన్న, ఎస్ ఎన్ ఎస్ ఆర్ డిగ్రీ లెక్చరర్ విద్యాసాగర్, మాలమహానాడు నాయకులు యస్. రవి కుమార్, లెక్చరర్ ప్రేమ్ కుమార్, డప్పు కళాకారుల బృందం, జై భీమ్ నాయకులు పాలమూరి కేశాలు తదితరులు పాల్గొన్నారు.