బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డా. బిఆర్ అంబేద్కర్
దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డా. బిఆర్ అంబేద్కర్
అంబేద్కర్ కు నివాళ్లు అర్పించిన గోరంట్ల శకుంతల
కర్నూలు టౌన్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :
అణగారిన, నిమ్నజాతుల హక్కుల పరిరక్షణకు గళమెత్తిన మహనీయుడు డా. బి ఆర్ అంబేద్కర్ అని రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి, వై ఎస్ ఆర్ సి పి నాయకురాలు గోరంట్ల శకుంతల అన్నారు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, నిమ్నజాతుల ఆశజ్యోతి డా. బి ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్బంగా గురువారం ఆమె పాత బస్టాండు వద్ద వున్న కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు, అలాగే పట్టణ నిరాశ్రయ మహిళా వసతి గృహం లో మహిళలతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పిస్తూ జయంతి వేడుకలు అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గోరంట్ల శకుంతల మాట్లాడుతూ దళిత, బడుగు బలహీన వర్గాల కు రిజర్వేషన్ లు కల్పించిన మహనీయుడు అంబెడ్కర్ అని అన్నారు. అంటరానితనం, దారిద్ర్య నిర్ములన కు కృషి చేశాడన్నారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అనేక మంది దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.