ఘనంగా అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు
అనగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ అలుపెరుగని పోరాటం
…. జనసేన పార్టీ నాయకులు చింత సురేష్ బాబు, నక్కలమిట్ట శ్రీనివాసులు, మహబూబ్ బాషా, హసీనా బేగం
కర్నూలు టౌన్, ఏప్రిల్ 14, (సీమ కిరణం న్యూస్) :
కర్నూలు నగరంలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా జనసేన పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నగరంలోని పాత బస్టాండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడా వారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు చింత సురేష్ బాబు, నక్కల మిట్ట శ్రీనివాసులు, మహబూబ్ బాషా, జనసేన పార్టీ రాయలసీమ విభాగం వీర మహిళ కోఆర్డినేటర్ ఎస్ ఎం డి హసీనా బేగం మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికతకోసం తన జీవితం చివరి వరకూ పోరాటం చేశారు అని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టం అని కొనియాడారు. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ మంత్రి, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, వృత్తి రీత్యా లాయరు హలో ఎన్నో పదవులను చేపట్టారని అన్నారు. అంబేద్కర్ అడుగడుగునా ఛీత్కారాలు, అవమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషి, స్వీయప్రతిభతో ఎదిగి స్వతంత్ర భారత తొలి కేంద్ర మంత్రి పదవిని అలంకరించేస్థాయికి చేరుకున్నారు అని అన్నారు. తన జీవితాంతం అణగారివర్గాల గొంతుకను వినిపించి, వారి సాధికారికతకు అంబేడ్కర్ పాటుపడ్డారు అని తెలిపారు. కొలంబియా వర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి అర్ధశాస్త్రంలో గౌరవ డాక్టరేట్లు, అలాగే, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో న్యాయ, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు అని అన్నారు. జాతీయోద్యమంలో అడుగు పెట్టి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు అని పేర్కొన్నారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు అని అన్నారు. అలాగే, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపనలో అంబేడ్కర్ పాత్ర ఉంది అని తెలిపారు. హిల్టన్ యంగ్ కమిటీకి బాబాసాహెబ్ అందించిన భావనతో ఆర్బీఐ ఏర్పడిందని అన్నారు. తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు అనిల్ గౌతమ బుద్దుని బోధనలకు ప్రభావితమైన అంబేడ్కర్.. బౌద్ధుడిగా మారారు అని అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికీ నిప్పు కణికలా జ్వలిస్తూనే ఉంది అని పేర్కొన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. కుల, మత రహిత ఆధునిక భారతావనికి కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు అని పేర్కొన్నారు. దళితుల నాటి సమాజంలో ఉన్న వివక్షను పారద్రోలడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది అని తెలిపారు. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది అని అన్నారు. ‘బహిష్కృత హితకారిణి’ అనే సంస్థను స్థాపించి, అంటరానితనంపై పోరాటం చేశారు ఆయన పేర్కొన్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మాన్ని సవాల్ చేశారు అని తెలిపారు. 1931లో రౌండ్‌టేబుల్ సమావేశాల సందర్భంగా గాంధీజీని కలుసుకుని జాతీయోద్యమంలో భాగమయ్యారు అని తెలిపారు. స్వాతంత్రం తర్వాత దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతలను అంబేడ్కర్‌కు అప్పగించారు అని అన్నారు. రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటుచేసి రాజ్యాంగ రచనా కమిటీకి ఆయణ్ని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు అని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను ఆధ్వయనం చేసిన అంబేడ్కర్ చివకు దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు అన్నారు. డాక్టర్ అంబేడ్కర్ భారత దేశపు మూలస్తంభపు పునాది ఏంటో తన అధ్యయనం ద్వారా కనిపెట్టారు. ఆ అధ్యయనంలో తన జీవితాన్ని కూడా అంకితం చేశారు. అంబేడ్కర్.. తన ఆశయం కోసం, భారతదేశ భవిష్యత్తు కోసం ఎంతగానో శ్రమించారు. బాంబే యూనివర్సిటీలో బీఏ చదివిన అంబేడ్కర్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీలో ఎంఎ పూర్తిచేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఎమ్మెస్సీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ కొలంబియా విశ్వవిద్యాలయంలోనే పీహెచ్‌డీ పూర్తిచేశారు. అయినా, అంబేడ్కర్ చదువును అంతటితో ఆపలేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డీఎస్సీ చదివారు. అంబేడ్కర్ విజ్ఞానాన్ని గుర్తించిన కొలంబియా యూనివర్సిటీ ఎల్‌ఎల్‌డి గౌరవ పట్టా ప్రదానం చేసింది. అలాగే, ఉస్మానియా యూనివర్సిటీ కూడా డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ పట్టా అందజేసింది. గ్రేస్ ఇన్ లండన్ యూనివర్సిటీలో బారిష్టర్ ఎట్ లా చదివారు భీంరావ్ విదేశాల్లో ఎకనమిక్స్‌లో డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు అని అన్నారు.