ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ :-
ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయండి :-
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :-
ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. గురువారం కర్నూలు నగరం ఏపీఎస్పీ బెటాలియన్ ఉన్న హెలిప్యాడ్‌ను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డిలు పరిశీలించారు. అందులో భాగంగా ఏపీఎస్పీ బెటాలియన్ హెలిప్యాడ్ నుంచి బళ్లారి చౌరస్తా మీదుగా కృష్ణానగర్ లో ఉన్న పత్తికొండ ఎమ్మెల్యే నివాస గృహానికి వెళ్లే మార్గంలో మరియు నివాస గృహంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం వెళ్లే రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. హెలిప్యాడ్, బారికేడ్లు, అగ్నిమాపక వాహనం ఏర్పాట్లు భద్రతా సౌకర్యం, ట్రాఫిక్, ప్రొటోకాల్, పరశుభ్రత, తదితర అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గారి వెంట జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.