ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు ప్రత్యేక గుర్తింపు
– అత్యుత్తమ అసోసియేషన్లలో ఇది ఒకటి.
– రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు స్పోర్ట్స్ , ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :
దేశంలోనే అత్యుత్తమ క్రీడా సంఘాలలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. గురువారం స్థానిక మౌర్యా ఇన్ లోని పరిణయ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతోమంది మేటి,యువ క్రీడాకారులు తమ అసోసియేషన్ ద్వారానే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిథ్యం వహించి కీర్తిప్రతిష్టలు సంపాదించారన్నారు. అసోసియేషన్ తరుపున అనేక ప్రతిష్టాత్మకమైన పోటీలను నిర్వహించి యువ క్రీడాకారులను రాణించేందుకు దోహదపడ్డామున్నారు. ప్రస్తుత కమిటీ నాలుగేళ్ల పాటు ఉన్న పదవీ కాలం ముగిసిందని అన్నారు. అత్యవసర ఈసీ మీటింగ్ ను నిర్వహించి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారు కూడా బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి కృషి చేయాలని అందులో భాగంగానే యువతకు ప్రాధాన్యతను ఇస్తూ అసోసియేషన్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు.నూతన జిల్లాల్లో కూడా కమి టీలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో అసోసియేషన్ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు.
– తాత్కాలిక నూతన కమిటీ ఇదే
అధ్యక్షుడుగా టి.నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎ.శ్రీనివాస భట్, కోశాధికారిగా మహమ్మద్ షఫి, ఉపాధ్యక్షులుగా కె.వంశీధర్, శ్రీనివాసన్, సంయుక్త కార్యదర్శులుగా కె.భరణీ కుమార్, కె.మహేష్ కార్యవర్గ సభ్యులుగా చంద్రసుబ్బారెడ్డి, సి.వి.సురేష్ రాజేష్రెడ్డి, ఎం.వి. సతీష్ కుమార్, కో-ఆప్షన్ సభ్యుడిగా జె.రవికుమారు ఎన్నుకున్నట్లు వారు వివరించారు. అనంతరం నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన నారాయణరెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్ఫూర్తితో మరింత బలోపేతం చేస్తూ ముందుకెళ్తామన్నారు.26 జిల్లాల్లో నూతన కమిటీల ను ఏర్పాటుచేసి ప్రజాస్వామ్య బద్దంగా రాష్ట్ర కమిటికి నూతనంగా ఎన్నుకునేలా చేస్తామన్నారు.