ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత
జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత…..
జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
• 850 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.
• పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 15, (సీమకిరణం న్యూస్) :
ఈ నెల 16 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులోని పత్తికొండ ఎమ్మెల్యే నివాస గృహాంలో జరిగే వివాహా వేడుకకు హాజరవుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన సంధర్బంగా కర్నూలు – ఓర్వకల్లు విమానాశ్రయం, కర్నూలు 2 వ బెటాలియన్ – హెలిప్యాడ్ నుండి కర్నూలు, క్రిష్ణ నగర్ లోని పత్తికొండ ఎమ్మెల్యే నివాస గృహాంలో జరిగే ఒక వివాహా వేడుక వరకు గల రూట్ & రూఫ్ – టాప్ ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు , 7 మంది డిఎస్పీలు, 19 మంది సిఐలు, 43 మంది ఎస్సైలు, 157 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు, 384 మంది కానిస్టేబుళ్ళు, 34 మంది మహిళా పోలీసులు, 120 మంది హోంగార్డులు, 03 ప్లటూన్ల ఏ ఆర్ సిబ్బంది, 04 ప్లటూన్ల APSP సిబ్బంది, 6 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు.