ఘనంగా ఉర్దూ కవి సమ్మేళనం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట ఏప్రిల్ 15, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండల కేంద్రంలోని చిన్న దర్గాల పరిధిలో వెలసివున్న ఉస్తాద్ బాబా దర్గా గంధ మహోత్సవం సందర్భంగా ఉర్దూకవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు రాష్ట్ర కవులతో స్థానిక కవులు, రచయితలు పాల్గొన్నారు. పలువురు కవులు తమ కవిత్వాన్ని, గీతాలను లయబద్ధంగా ఆలపించగా విచ్చేసిన ప్రజలు ఎంతో ఆనందించారు. హాజరైన కవులు వల్లిస్తున్న కవితలకు (షాహిరి) కి భక్తులు ముగ్ధులై అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన కవులను మరియు అతిథులు స్థానిక ఎస్ఐ పెద్ద దర్గా ఉప పీఠాధిపతి లను నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఉస్తాద్ బాబా దర్గా సజ్జాద నషీన్ అబ్బాస్ అలీ బేగ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా స్థానిక ఎస్ఐ షేక్ సుభాని ,ఖాజా నాయబ్ రసూల్ దర్గా ఉప పీఠాధిపతి ఎస్ జి ఎన్ జునేద్ పాషా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాబా దర్గా మేనేజ్మెంట్ ఎండి రహమత్ అలీ, కవి సమ్మేళనం కార్య నిర్వాహకులు మోహసీన్ జల్గాన్వి, ఆరీఫ్ అమినీ తదితరులు పాల్గొన్నారు.