★ పెండ్లి కుమారుని ఆశీర్వదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి :-
★ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో ముఖాముఖి అయి ఆప్యాయంగా పేరుపేరునా పలకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి :-
కర్నూలు కలెక్టరేట్ , ఏప్రిల్ 16, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఏపీఎస్పీ బెటాలియన్ హెలిప్యాడ్ కి చేరుకున్నారు.
హెలిప్యాడ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం :-
ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో ఏపీపీఎస్సీ బెటాలియన్ హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ భార్గవ తేజ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ పి.పి.నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.వి. మోహన్ రెడ్డి, లబ్బి వెంకట స్వామి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఘనంగా స్వాగతం పలికారు.
ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో ముఖాముఖి అయి ఆప్యాయంగా పేరుపేరునా పలకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి :-
హెలిప్యాడ్ సమీపంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖాముఖి అయి ఆప్యాయంగా పేరుపేరునా పలకరించగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి అర్జీలు అందజేశారు. అనంతరం ఏపీఎస్పీ బెటాలియన్ హెలిప్యాడ్ నుంచి సీఎం కాన్వాయ్ బయలుదేరి బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్ మీదుగా రోడ్డు మార్గంలో కృష్ణానగర్‌లోని పత్తికొండ ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ కుమారుని వివాహం సందర్భంగా చెరుకులపాడు వంశీధర్ రెడ్డి పెండ్లి కుమారుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీర్వదించి పుష్పగుచ్ఛాలు అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వివాహ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు గారు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డిలు కలరు.