విరుపాపురం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు
చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ ప్రహ్లాద యాదవ్, మాజీ జెడ్పిటిసి ఆనంద్
ఆదోని ప్రతినిధి. ఏప్రిల్ 15. (సీమకిరణం న్యూస్) :
ఆదోని మండలం పరిధిలోని విరుపాపురం గ్రామంలో ఏఐ టి సీసీ , క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ యాదవ్ మాజీ జెడ్పిటిసి ఆనంద్,సంఘ సభ్యులు ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విరుపాపురం సర్పంచ్ ప్రహ్లాద యాదవ్, మాజీ జెడ్పిటిసి ఆనంద్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఏఐటి సీసీ , క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో మా గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎందుకంటే ఆదోని నుండి పత్తికొండ కు వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన చలివేంద్రం ఏర్పాటు చేశారు కాబట్టి పత్తికొండ కు వెళ్లే వాహనదారులు సైతం చలివేంద్రం దగ్గర దాహం తీర్చుకుంటున్నారని తెలిపరు.అలాగే చలివేంద్రం దగ్గర తాగునీటిని వృథా చేయకూడదని వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కువ శాతం తాగునీటిని తీసుకోవాలని నీరు ఎక్కువ తీసుకోవడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటాడని ప్రతి ఒక్కరు కూడా తగినంత నీటిని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. అలాగే గత మూడు సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ఏఐటి సీసీ , క్రీస్తుసంఘం వారికి మా గ్రామం తరపున మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ జెడ్పిటిసి ఆనంద్ మాట్లాడుతూ శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని చెప్పిన దయామయుడు ఏసుక్రీస్తు, సాటివారి పట్ల ప్రేమ, అవధులు లేని త్యాగం,ఇదే జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం,జీసస్ మహాత్యాగానికి ప్రతీక యే గుడ్ ఫ్రైడే,ఇలాంటి రోజున ఏఐటి సీసీ , క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఏసుప్రభు వారి కుటుంబసభ్యులును ఎల్లవేళలా చల్లగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటి సీసీ , క్రీస్తుసంఘం సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.