ఆర్థిక మంత్రి బుగ్గన కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం
ప్యాపిలి మండల వైసీపీ నాయకులు
ప్యాపిలి, ఏప్రిల్ 15, (సీమకిరణం న్యూస్) :
రెండవసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా ప్యాపిలి మండలానికి వచ్చిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి నంద్యాల జిల్లా సరిహద్దుల్లోని పోదొడ్డి గ్రామంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు . ఈ సందర్భంగా ప్యాపిలి మండల వైసిపి నాయకులు జడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ దంపతులు గోకుల్ లక్ష్మి, దిలీప్ చక్రవర్తి, మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, డోన్ మున్సిపల్ చైర్మన్ సప్త శైల రాజేష్, రాజా నారాయణమూర్తి, గడ్డం భువనేశ్వర్ రెడ్డి, బొర్ర మల్లికార్జునరెడ్డి, బత్తుల రమేష్ రెడ్డి, పోతుదొడ్డి సర్పంచి రంగమ్మ, రంగనాయకులు, సీమ సుధాకర్ రెడ్డి,పోతుదొడ్డి కృష్ణమూర్తి, బోరెడ్డి రాము, కమతం భాస్కరరెడ్డి, బండి ఎర్రిస్వామి, తదితరులు మంత్రి రాజారెడ్డికి బొకేలు, శాలువాలతో, పూలమాలలతో సత్కరించి అభినందించారు