బాపట్ల జిల్లా :
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నుండీ స్పందన కార్యక్రమం నిర్వహణ.
బాపట్ల జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి విజ్ఞప్తి.
ప్రజలు తమ సమస్యలపై స్వేచ్ఛగా పిటీషన్లు అందజేయవచ్చు.
ఇక నుండీ ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించబడును : జిల్లా ఎస్పీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతీ సోమవారం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం బాపట్ల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలపై పిటీషన్లు అందజేయవచ్చన్నారు. ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన ఉంటుందని తెలియజేశారు. జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ లు, సర్కిల్ ఆఫీస్ లు మరియు SDPO ఆఫీస్ ల నందు కూడా స్పందన కార్యక్రమము జరుగును.