అంగరంగ వైభవంగా ఉస్తాద్ బాబా గంధ మహోత్సవం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 16, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండల కేంద్రం లోని చిన్న దర్గాల పరిధిలో వెలిసి ఉన్న హజరత్ మీర్జా మహమ్మద్ హుస్సేన్ ఉరఫ్ ఉస్తాద్ బాబా స్వాముల వారి 54 వ గంధమహోత్సవం శుక్రవారం రాత్రికి అంగరంగ వైభవంగా నిర్వహించారు గంధ మహోత్సవం నకు స్థానిక ఖాజా నాయబ్ రసూల్ పెద్ద దర్గా ఉప పీఠాధిపతి ఎస్ జి ఎన్ జునేద్ పాషా హాజరై ప్రత్యేక ఫాతిహా లు చేసిన అనంతరం ఉస్తాద్ బాబా అతిథి గృహం నుండి గంధ కలశములను ఉస్తాద్ బాబా దర్గా పీఠాధిపతి అబ్బాస్ అలీ బేగ్, మేనేజ్మెంట్ ఎండి రహమత్ అలీ ఉస్తాద్ బాబా మూడవ కుమారుడు రహమతుల్లా బేగ్ లు గంధపు బిందెలను తలపై ఉంచుకుని గంధ మహోత్సవమును భక్తి శ్రద్ధలతో భక్తి కీర్తనలు, ఫకీర్ల జరబులు, మేళ తాళాలు, బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా వెళ్లి స్థానిక పెద్ద దర్గా లో ప్రార్థనలు చేశారు అనంతరం ఫక్రుద్దీన్ బాబా దర్గా లో ప్రార్థనలు నిర్వహించి గంధమహోత్సవం ఉస్తాద్ బాబా దర్గా కు చేర్చారు అక్కడ సమాధులకు గంధ లేపన0 చేసి ప్రత్యేక సలాములు పాడి ఫాతిహా లు చదివారు అనంతరం భక్తులకు గంధ ప్రసాదాలు పంచిపెట్టారు గంధ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక అన్నదానం ఏర్పాటు చేశారు గంధమహోత్సవం అనంతరం ఖవాలి పాట కచేరీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పాణ్యం ఆస్థాన నిర్వాహకులు ఖలీఫా లియాకత్ అలీ బేగ్ నిజామి, తెలంగాణ కాజీపేట కు చెందిన ఖలీఫా యాఖూబ్ చిష్టి , సూఫీ కరీముల్లా నిజామీ ఇతర గురువులు స్థానికులు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు గంధ మహోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ఐ షేక్ సుభాని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. శనివారం దీపాలంకరణ ఉరుసు మహోత్సవం అనంతరం ఖవాలీ ఆదివారం తాహలీల్ ఫాతిహా తో గంధమహోత్సవం కార్యక్రమాలు ముగియనున్నట్లు సజ్జాద నషీన్ అబ్బాస్ అలీ తెలిపారు..