రోటరీ మహా కాలేశ్వర ఆలయాన్ని సందర్శించిన హర్యానా గవర్నర్

రాజమహేంద్రవరం :- రోటరీ మహా కాలేశ్వర ఆలయాన్ని సందర్శించిన హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ..
పూర్ణ కుంభం తో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు
శనివారం రాజమహేంద్రవరం లో నూతనంగా నిర్మించి ఇటీవల ప్రారంభించిన రోటరీ మహా కాలేశ్వర ఆలయాన్ని హర్యానా గవర్నర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ నిర్మాణకర్త రోటరీ క్లబ్ అధ్యక్షులు పట్టపగలు వెంకట్రావు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కూరెళ్ల ఆదిత్య కుమార్ శర్మ , తదితరులు పూర్ణ కుంభం తో, ఆలయ మర్యాద లతో స్వాగతం పలికారు. తదుపరి ఆలయం లో పూజాధికాలు నిర్వహించి, ఆశీర్వాదాలు అందచేసి, అమ్మవారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని, పట్టు వస్త్రాలను అందచేశారు. తొలుత ఆలయానికి చేరుకున్న గవర్నర్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 64 ఆలయ నమూనా దేవతామూర్తు లను దర్శనం చేసుకుని, అనంతరం మూల విరాట్ ని దర్శించు కుని, పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగాగవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కేంద్రం, భారతీయ సంస్కృతి, సంప్రయాలకు నిలయంగా శ్రీ మహాకాలేశ్వర్ ఆలయాన్ని నిర్మించడం అభినందనీయ మన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా నైతిక విలువలు, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ముక్కోటి దేవతలు ఒక్క చోటే దర్శనం కలుగ చేసేవిధంగా ఆలయ నిర్మాణం చెయ్యడం పట్ల రోటరీ సభ్యులను ఆయన అభినందించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని జీవితంలో ఒక్కసారి అయినా తప్పనిసరిగా దర్శనం చేసుకోవలసిన క్షేత్రం గా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో రోటరీ అధ్యక్షులు పట్టపగలు వెంకట్రావు, మాజి ఎమ్మెల్సి సోము వీర్రాజు, రోటరీ సభ్యులు మధు పామ్రా, సంజీవరావు, సీతారామ మాలేశ్వర్, పి. ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.