ANDHRABREAKING NEWSCRIMESPORTSSTATEWORLD

ఏపీలో మే 9 నుంచి స‌మ్మ‌ర్ హాలిడేస్‌..

ఏపీలో మే 9 నుంచి స‌మ్మ‌ర్ హాలిడేస్‌..

— జులై 4న స్కూళ్ల రీఓపెన్‌

–ఈ నెల 27 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు.

–1 నుంచి 9 త‌ర‌గ‌తుల‌కు మే 4 వ‌ర‌కు స‌మ్మేటివ్‌-2 ప‌రీక్ష‌లు.

టెన్త్ ప‌రీక్ష‌లు ముగియ‌గానే స‌మ్మ‌ర్ హాలిడేస్ ప్రారంభం.

ఏపీలో పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జులై 4 నుంచి మొద‌లు కానుంది. ఈ మేర‌కు శ‌నివారం ఏపీ విద్యా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు మొద‌లు కానున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్ష‌లు ఈ నెల 27 నుంచి మే 9 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప‌రీక్ష‌లు పూర్తి కాగానే వారికి వేస‌వి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏపీలోని జూనియర్‌ కాలేజీలకు మే 25 నుంచి జూన్‌ 20 వరకు సమ్మర్‌ హాలిడేస్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణ‌యించింది.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!