ముఖ్యమంత్రిని కలిసిన 23వ వార్డు కార్పొరేటర్ కటారి పల్లవి
వార్డు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన కటారి పల్లవి
సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ
సంతోషంలో వార్డు ప్రజలు
కర్నూలు టౌన్, ఏప్రిల్ 16, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఏపీఎస్పీ బెటాలియన్ హెలిప్యాడ్ కి చేరుకున్నారు. ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని 23వ వార్డు కార్పొరేటర్ కటారి పల్లవి కలిశారు. వార్డులో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వార్డులో ఉన్న సమస్యలను వినతి పత్రం రూపంలో ముఖ్యమంత్రికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా వార్డులో ఎప్పటినుంచో ఎదురుకొంటున్న సుద్ద వాగు రక్షణ గోడ గురించి కటారి పల్లవి ముఖ్యమంత్రి కి వివరించారు. గతంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ఆమోదం తెలిపిన తరువాత ఎవరు ఆ సమస్య ను పట్టించుకోలేదని తెలిపారు. సమస్యను విన్న వెంటనే ముఖ్యమంత్రి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. వారు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.