“శాప్”కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావలేను!
“శాప్”కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావలేను!
కోచ్ నే ఇంచార్జ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా కొనసాగింపు
కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ తో మార్పులు
కోచ్లు, ఆఫీస్ సిబ్బందికి స్థానచలనం
విజయవాడ స్పోర్ట్స్, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తో 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు కావడంతో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) లో శిక్షకులు (కోచ్లు), ఆఫీస్ సిబ్బందికి స్థానచలనం కల్పించారు. మొదటగా 26 జిల్లాలకు చీఫ్ కోచ్ లను నియమించిన శాప్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి కొత్త భాష్యానికి నిర్వచనం తెలియజేస్తూ శాప్ కార్యాలయంలో ఉన్న జూనియర్, సీనియర్ అసిస్టెంట్ లను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ లోనికి బదిలీ చేసి జిల్లాల్లో ఉన్న వారిని శాప్ కార్యాలయంలోనికి, కొత్త ఏర్పడిన జిల్లాలోకి బదిలీలు చేశారు. కొత్త జిల్లాలోకి కోచ్ ల బదిలీలను కౌన్సిలింగ్ నిర్వహించి 26 జిల్లాలకు కోచ్ లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కొన్ని కొత్త జిల్లాల్లో వాస్తవానికి సౌకర్యాలు లేకపోవడంతో అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపినట్లు సమాచారం. మైదానాల అభివృద్ధి, కొత్తగా కోచింగ్ సెంటర్ల ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు విశ్వాసనీయవర్గాల సమాచారం.
“శాప్”కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావలేను!
శాప్ చట్టం ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉందో లేదో కానీ శాప్ లో కోచ్ నే ఇంచార్జ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా కొనసాగింపు చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సీనియర్ కోచ్ లను స్పోర్ట్స్ ఆఫీసర్ లుగా పోస్ట్ ఇచ్చి శాప్ కార్యాలయంలో పోస్ట్ ఇవ్వడం జరగడంతో తనకు ఉన్న పరిచయాలు ఉపయోగించి స్పోర్ట్స్ ఆఫీసర్ గా ఉన్న సదరు కోచ్ ఇంచార్జ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. ట్రాన్సఫర్స్ లో భాగంగా శాప్ కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ని నియమించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.
స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ కు మంగళం
శాప్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి నియామకం జి.ఓ.2323 కి వ్యతిరేకంగా ఉందని విధుల నుండి తొలగించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజత్ భార్గవ్ కి అందిన కంప్లైంట్ ఆధారంగా విచారణ జరిపిన రాజత్ భార్గవ సదరు అధికారిని విధుల నుండి తొలగించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ని నియమించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.