నేతన్న సమష్యాలను ప్రభుత్వం పరిష్కరించాలి..
చేనేతల మహాధర్నా గొడపత్రిక ఆవిష్కరణ…
కర్నూలు టౌన్, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :
మానవుడి మానాన్ని కాపాడేందుకు పోగు పోగు నేసి బట్టలుగా మార్చి భూమి పై ఉన్న ప్రతి మానవుని మానాన్ని కాపాడే చేనేతల కష్టాలను, సమష్యలను పరిష్కరించే విషయం లో మాత్రం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సర్యం చేస్తున్నారని ఆ ప్రభుత్వంల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈనెల 23 వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ నందు చేనేత ల మహాధర్నా ను నిర్వహిస్తున్నరూ. అందులో భాగంగా సోమవారం నగరంలో ని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ఎదుట చేనేతల మహాధర్నా కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంగం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, మహాధర్నా నిర్వహణ కమిటీ కన్వీనర్ చింతా శ్రీనివాస్, రాష్ట్ర మహిళ నాయకురాలు శకుంతల, భావాసారా క్షేత్రియా రాష్ట్ర నాయకులు హెచ్ ర్ ఎస్ రావు, సంగం నాయకులు చంద్రసెఖర్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.