BREAKING NEWSBUSINESSCRIMEMOVIESPOLITICSSTATETELANGANAWORLD

ఘనంగా గంజహళ్లి బడేసాహెబ్ ఉరుసు మహోత్సవం

ఘనంగా గంజహళ్లి బడేసాహెబ్ ఉరుసు మహోత్సవం

ఉరుసు మహోత్సవంలో వివిధ రాజకీయ ప్రముఖులు..

గోనెగండ్ల , మార్చి 10 , ( సీమకిరణం న్యూస్ ) :

గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మా గంజహళ్లి బడేసాహెబ్ స్వామివారి 328 వ ఉరుసు మహోత్సవంలో భాగంగా వేకువజామున గంధం భారీ భక్తుల నడుమ ప్రారంభమైంది.ఈ మహోత్సవంలో దర్గా పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముదగోల్ వారి కుటుంబ పీఠాధిపతులు కలిసి బడేసాహెబ్ స్వామి వారి దర్గా వరకు భారీ వేల సంఖ్య భక్తుల నడుమ అంగ రంగ వైభవంగా గంధమును స్వామి వారి దర్గాలో సమర్పించి. ప్రత్యేక ఫతే హాలు నిర్వహించి ఉరుసు మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి సయ్యద్ చిన్న ముదగోల్ మాట్లాడుతూ గంధo మహోత్సవం తో గంధం ముగించుకొని ఈరోజు ఉరుసు మహోత్సవాన్ని జరుపుకుంటామని అన్నారు అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని ప్రార్థించ అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్గా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

ఉరుసు మహోత్సవానికి వివిధ రాజకీయ ప్రముఖులు :

మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక, కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.వి జయ నాగేశ్వర్రెడ్డి తదితర రాజకీయ నాయకులు పాల్గొని దర్గాలో సందర్శించి ప్రత్యేక ఫతేహాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!