ANDHRABREAKING NEWSSTATE
లోకాయుక్త జస్టిస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జాయింట్ కలెక్టర్
ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జాయింట్ కలెక్టర్
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారి ఆనుకొని ఉన్న సంతోష్ నగర్ లో లోకాయుక్త సంస్థ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డిని జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.
జాయింట్ కలెక్టర్ పాటు కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్యలు ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.