
50 లీటర్ల నాటుసారా స్వాధీనం
ముగ్గురు అరెస్ట్
రుద్రవరం , ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :
మండలంలోని చెంచుగూడెం గ్రామ సమీపంలో ఉన్న తెలుగుగంగ కాలువ పరిధిలో ముళ్ళ పొదల చాటున నాటు సారా కాస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల మేరకు చెంచుగూడెం గ్రామానికి చెందిన యాకోబు, శివాజీ, లక్ష్మణ లు నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేయడం జరిగిందన్నారు. ఈ దాడిలో వీరి వద్ద నుండి 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని రెండు వేల లీటర్ల ఊట ను ధ్వంసం చేసి వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.