స్థల వివాదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు
-: యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్):
ఆదివారం హైదరాబాద్ సిటీ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన స్థల
వివాదంపై , రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పై జరిగినటువంటి దుష్ప్రచారాన్ని యువ
పారిశ్రామికవేత్త టీజీ భరత్ సోమవారం ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చినటువంటి కథనాల్లో ఎటువంటి నిజం లేదని టీజీ భరత్ వివరణ ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో తన తండ్రి టీజీ వెంకటేష్ పేరు లేకపోయినప్పటికీ కావాలనే తమ కుటుంబ పరువు, ప్రతిష్టలు దెబ్బ
తీయాలనే ఉద్దేశంతో కొందరు పని గట్టుకుని ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆ యన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచైనా ఇటువంటి దుష్ప్రచారం చేసేముందు, వాస్తవాలు తెలుసుకోవాలని ఎదుటి వారి కుటుంబ పరువు ప్రతిష్ట దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు . వాస్తవాలు కాకుండా,ఇలాంటి అవాస్తవాలను పనిగట్టుకుని ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటా మని టీజీ భరత్
హెచ్చరించారు.