బెళుగుప్ఫ పోలీసుస్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

బెళుగుప్ఫ పోలీసుస్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
అనంతపురం క్రైమ్, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్) :
బెళుగుప్ప పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, రికార్డులు, రిసెప్సన్ సెంటర్, స్టేషన్ పరిసరాలను మరియు పోలీసు స్టేషన్ కోసం బస్టాండు సమీపంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. బెళుగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఉంటున్న తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసులను సమీక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దన్నారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ , అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కట్టడికి పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు.