
ఉరవకొండ మండలం ఆమిద్యాల, చిన్నముష్టూరు గ్రామాల్లోని జోగినీల ఇంటికెళ్లిన ఎస్పీ.
* జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న ఆమిద్యాల పార్వతమ్మ, చిన్న ముష్టూరు ఎర్రమ్మ (జోగినీ)ల ఇళ్లకెళ్లి పలుకరించిన జిల్లా ఎస్పీ.
* వారి క్షేమ సమాచారాలు, ఆరోగ్య పరిస్థితులపై ముఖాముఖిగా అడిగి తెలుసుకున్న ఎస్పీ.
* కంటి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకున్న జోగినీల జీవనం కోసం బియ్యం, కంది పప్పు, బెల్లం, తదితర నిత్యావసరాలతో పాటు పండ్లు, చీరలు అందజేశారు.
* జిల్లా ఎస్పీ సంకల్పంతో 20 రోజుల కిందట అనంతపురంలోని శ్రీనేత్ర కంటి ఆసుపత్రిలో 22 మంది జోగినీలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయించిన విషయం విదితమే.
* ఆసందర్భంగా… ఉరవకొండ, కళ్యాణదుర్గం, గార్లదిన్నె ప్రాంతాలకు చెందిన జోగినీలు కంటి ఆపరేషన్లు చేయించుకున్నారు.
* వీరిని పలుకరించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకే జోగినీల ఇళ్లకు వెళ్లినట్లు ఎస్పీ వెల్లడి.
* జిల్లా ఎస్పీతో పాటు ఉరవకొండ సి.ఐ శేఖర్ , ఎస్సై టి.పి వెంకటస్వామి, తదితరులు వెళ్లారు.