జర్నలిస్టులు నిస్వార్ధ సేవకులు
జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి అభినందనీయం
జర్నలిస్టులు నిస్వార్ధ సేవకులు
శ్రీ ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్టుల క్రికెట్ ట్రోఫీలను ఆవిష్కరించిన కమిషనర్ వి.వి.ఎస్ మూర్తి
జిల్లా ఎస్పీ పకీరప్ప, RDT సహకారం అభినందనీయం
మచ్చా రామలింగారెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి అభినందనీయం
కమిషనర్ వి.వి.ఎస్ మూర్తి
అనంతపురం టౌన్, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్) :
జర్నలిస్టులు సమాజసేవకులు ప్రాణాలకు సైతం తెగించి పనిచేస్తున్నావారు అని వారి సేవలు వెలకట్టలేనివి అని వి. వి.ఎస్.మూర్తి కమిషనర్ అనంతపురం కార్పొరేషన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ APWJU ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు మంగళవారం ఉదయం శ్రీ ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీలను, ఫైనల్స్ డ్రస్సులను ఆవిష్కరణ, సభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మూర్తి అనంతపురం కార్పొరేషన్ కమిషనర్, మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పాల్గొన్నారు, ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి విజయరాజు అధ్యక్షత వహించాడు. సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు తదితర జర్నలిస్ట్ క్రికెట్ టీం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వి.వి.ఎస్ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం గ్రామీణ విలేకరులకు నిర్వహించడం అభినందనీయమని ఇది రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు స్ఫూర్తినిస్తుందని కమిషనర్ వి.వి.ఎస్ మూర్తి అన్నారు. మచ్చా రామలింగారెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న కృషి వెలకట్టలేనిది అని ఇటువంటి నాయకుడు ఉండడం మీ అందరి అదృష్టమని అన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప టోర్నమెంట్లో సెమీ ఫైనల్స్ కు చేరిన నాలుగు జట్టులకు పోలీస్ శాఖ ద్వారా డ్రెస్సులు ఇవ్వడం శుభపరిణామం జర్నలిస్టులు అధికారుల మధ్య ఐకమత్యానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయని వి.వి.ఎస్ మూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ట్రోఫీలు చాలా బాగున్నాయి అని జాతీయస్థాయిలో ఉండే విధంగా క్రికెట్ ట్రోఫీలను చూస్తుంటే నాకు కూడా క్రికెట్ ఆడి ఇటువంటి ట్రోఫీలు గెలవాలని అనిపిస్తున్నది అని వి.వి.ఎస్ మూర్తి అన్నారు. మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మాట్లాడుతూ జిల్లాకు ఫాదర్ ఫాదర్ చేసిన సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది జర్నలిస్టులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ జర్నలిస్టుల ఐకమత్యం కోసం ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పోటీల నిర్వహణకు సహకారం అందించిన మంచో ఫెర్రర్ ఆర్.డి.టి డైరెక్టర్, RDT సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో అనంతపురంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను జర్నలిస్టులకు నిర్వహిస్తామని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులను ఆహ్వానించి అనంతపురం జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేస్తామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు సభ అనంతరం కమిషనర్ మూర్తి, మచ్చా రామలింగారెడ్డి జర్నలిస్టు క్రికెట్ ట్రోఫీలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శ్రావణ్, ఉపేంద్ర, దాదు, చలపతి, అది, షకీర్, జానీ, మల్లికార్జున, ప్రసాద్, రవి, వెంకట్ రామ్ రెడ్డి, శేఖర్, రామంజి, సాయిరాం, అనంతపురం తాడిపత్రి రాప్తాడు జర్నలిస్టు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.