ఆళ్లగడ్డ లో జిల్లా స్థాయి క్రీడా పోటీలు
ఆళ్లగడ్డ లో జిల్లా స్థాయి క్రీడా పోటీలు
ఆళ్లగడ్డ , ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్) :
భూమా శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా పట్టణంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమా అఖిలప్రియ తెలిపారు. పట్టణంలోనీ స్వగృహంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తన తల్లి దివంగత ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఆశయం మేరకు భూమా శోభా నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలలో పాల్గొనదలచిన జట్లు 19న రు. 500 ఎంట్రీ ఫీజు తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 25 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి 15 వేల రూపాయలు ఉంటుందన్నారు. కాగా మ్యాచులు 20వ తేదీ నుండి ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు 8464818696, 8186929070 నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు. కబడ్డీ పోటీలలో పాల్గొనదలచిన వారు ఈ నెల 21వ తేదీలోగా తమ పేర్లను 500 రూపాయల ఎంట్రీ ఫీజు తో నమోదు చేసుకోవాలన్నారు. మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండో బహుమతి పది వేలు రూపాయలు, మూడో బహుమతి ఐదువేల రూపాయలు ఉంటుందన్నారు. వివరాలకు 8464818696, 8186929070 నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు. శటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన దలచిన జట్లు ఈనెల 21వ తేదీలోగా ₹500 ఎంట్రీ ఫీజు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందులో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 15 వేల రూపాయలు, రెండవ బహుమతి పది వేలు రూపాయలు, మూడవ బహుమతి ఏడు వేల రూపాయలు, నాలుగో బహుమతి ఐదువేల రూపాయలు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 7981988755 నెంబరును సంప్రదించాలన్నారు. శోభా నాగిరెడ్డి వర్ధంతి రోజైనా ఏప్రిల్ 24న సాయంత్రం నాలుగు గంటలకు వై పి పి ఎం జూనియర్ కళాశాల ఆవరణంలో బహుమతి ప్రధానం ఉంటుందన్నారు.