ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులు వాలంటీర్లు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులు వాలంటీర్లు…
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్) :
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సేవలు అందించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకొని వచ్చారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. మండలంలోని పేరాయి పల్లి నల్లగట్ల, బత్తులూరు జి.జంబులదిన్నె, అహోబిలం గ్రామాలలో, వాలంటరీలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులమతాలకతీతంగా సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారన్నారు. వాలంటీర్లు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. గ్రామాలలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజలకు అందినప్పుడే గ్రామ అభివృద్ధి సాధ్యమన్నారు.అనంతరం సేవ వజ్ర, సేవ రత్న, సేవా మిత్రలుగా ఎంపికైన వాలంటీర్లకు శాలువా కప్పి మెడల్ అందజేసి పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారెడ్డి, ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, కే డి సి సి బ్యాంక్ డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, ఉప ఎంపిపి నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి :
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. మండలంలోని జి.జంబులదిన్నె లో రూ.5.50 కోట్లతో జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు నిర్మించిన రోడ్లు, వకుళ వాగు పై నిర్మించిన బ్రిడ్జిని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో రూ. 21.08 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ.17.05 లక్ష లతో నిర్మించిన వైయస్సార్ విలేజ్ క్లీనిక్, రూ.15.07 లక్షలతో నిర్మించిన బల్క్ మిల్క్ కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.