ANDHRABREAKING NEWSCRIMEPOLITICS
ముగ్గురు అడ్మిన్ సెక్రెటరీల సస్పెండ్
ముగ్గురు అడ్మిన్ సెక్రెటరీల సస్పెండ్
నంద్యాల, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్) :
ముగ్గురు అడ్మిన్ సెక్రెటరీలను కమిషనర్ వెంకట కృష్ణ మంగళవారం సస్పెండ్ చేశారు. సచివాలయ నిర్వహణలో అలసత్వం, క్లాప్ నిర్వహణలో వైఫల్యం, మునిసిపల్ రెవెన్యూ వసూలులో నిర్లక్యం కారణాలపై ముగ్గురు అడ్మిన్ సెక్రెటరీలను ఆయన సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. 13వ వార్డు అడ్మిన్ సెక్రెటరీ మదన గోపాల్, 32వార్డు అడ్మిన్ సెక్రెటరీ కె. మధుసూదన్, 41వార్డు అడ్మిన్ సెక్రెటరీ ఆర్. నిహారికలను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వదిలే ప్రసక్తే లేదన్నారు.