మా ప్రజల నీటి వాటా తేల్చండి
ఆర్ సి సి మరియు ప్రజా సంఘాలు డిమాండ్

మా ప్రజల నీటి వాటా తేల్చండి అంటూ ఆర్ సి సి మరియు ప్రజా సంఘాలు డిమాండ్….
గోనెగండ్ల , ఏప్రిల్ 19 , ( సీమకిరణం న్యూస్ ) :
మా ప్రజల నీటి వాటా తేల్చండి అంటూ రాయలసీమ కోఆర్డినేషన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముట్టడి రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గాజులదిన్నె ప్రాజెక్టు నీటి సాధన యాత్ర కార్యక్రమంలో భాగంగా సీమ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి రామరాజు మరియు సహాయ కార్యదర్శి నవీన్ లు మాట్లాడుతూ 1970లో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్న కరువు వలసలను వృత్తిరీత్యా వలసలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత ప్రజలకు నీరు ఎంతైనా అవసరమని నాటి కాలంలో మండల ప్రజల కోసం నాటి ప్రజలు పాటుపడి చెమట చిందించి భూములు త్యాగం చేసి, కష్టాన్ని గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మాణం కోసం వెచ్చిస్తే నేటి పాలకులు మాత్రం నీటిని ఎక్కడికి తరలిస్తున్నారు చెప్పడం లేదు పైగా గోనెగండ్ల మండలం ప్రజలకు తాగు సాగు నీరు అందించడం లేదు మరి మరి అంతే కాక ఈ మధ్య ఒక టీఎంసీ పెంచారు ఉన్న నీటిని ఎవరికి ఎంత కేటాయిస్తున్నారు తేల్చకుండానే ఎత్తు మరియు సామర్థ్యం పెంచుతామని చెబుతున్నారు.ఇప్పుడు ముంపుకు గురవుతున్న గ్రామాలను సందర్శించకుండా ఏకపక్ష నిర్ణయంతో నష్టపోతున్న రైతుల భూములకు నష్టపరిహారం ప్రకటించలేదు కావున ప్రజల డిమాండ్ మేరకు భూములు కోల్పోతున్న ఆస్తులు కోల్పోతున్న వారికి ప్రభుత్వం మూడు రెట్ల పరిహారం అందించాలి అలాగే స్థానికంగా గాజులదిన్నె ప్రాజెక్టు ఉండే కాళీ జాబు లను స్థానిక యువతకి ఇవ్వాలి ఈ ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు అన్ని తెలిసి ప్రజల బాధలను గాలికి వదిలేసి కేవలం ప్రజలను ఓట్ల యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఇక్కడ ప్రజలను మభ్య పెడుతున్నారు అని తెలిపారు జనసేన భాష మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు చాలా వ్యతిరేకంగా ప్రజలు నష్టపోయే ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని గాజులదిన్నె ప్రాజెక్టు నీటి తప్పకుండా గోనెగండ్ల మండలం మండల ప్రజలకు కేటాయించాలని అన్నారు బహుజన్ సమాజ్ పార్టీ బంగారప్ప వారు కూడా ముందున్న రోజుల్లో పెద్ద ఎత్తున గాజులదిన్నె ప్రాజెక్టు నీటి సాధన యాత్రను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు రైతు కూలీ సంఘం జేమ్స్ హనుమంతయ్య వారు మాట్లాడుతూ రైతులు రైతులకు వ్యతిరేకమైన నిర్ణయాలు ప్రభుత్వానికి తగదని గోనెగండ్ల మండల ప్రజలు రైతులు కాదా రైతులకు రావాల్సిన నీళ్లను మండల ప్రజలకు కేటాయించే ఎంతవరకు రైతు కూలీ సంఘం గా ఎంతకైనా పోరాడుతామని గాజులదిన్నె ప్రాజెక్టు నీళ్లలో రెండు టీఎంసీలు కేటాయించే ఎంతవరకు ఈ ఉద్యమం ఆగదని మీడియా ముఖంగా తెలిపారు తదనంతరం పోలీసు యంత్రాంగం తో బైక్ ర్యాలీ ఆపవచ్చు గాని ప్రజలు ఈ సమస్యను బట్టి చైతన్యవంతులై అప్పుడు పరిస్థితులు చేయి జారకముందే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు అనంతరం ఎమ్మార్వో వేణుగోపాల్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విజన్ వేదిక రవివర్మ అనిల్ సీమ విద్యార్థి సంఘం గోనెగండ్ల మండల కమిటీ సద్దాం ఎర్రబాడు సద్దాం అశోక్ శివ నిత్యానంద రాజు దావీదు ఎంపిటిసి దేవపుత్ర పాల్గొన్నారు