ఫీజులతో సంబంధం లేకుండా ఇంటర్ హాల్ టికెట్స్ ఇవ్వాలి
• రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్):
ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా ప్రతి ఇంటర్మీడియట్ విద్యార్థికి హాల్ టికెట్ ఇవ్వాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ కాలేజి నందు ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి ఆర్ఐఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఫీజులు చెల్లించని వారికి హల్ టికెట్స్ ఇవ్వమని మెసేజ్స్ పంపడం, స్టాఫ్ ద్వారా ఫోన్స్ చేయడం జరుగుతుందని, పరీక్షల సమయంలో ఫీజుల పేరుతో ఇబ్బందులు పెట్టడం వల్ల విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురైతున్నారని ఆర్ఐఓకు వివరించారు. తక్షణమే ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నతాధికారులు స్పందించి ప్రతి విద్యార్థికి హాల్ టికెట్ ఇచ్చే విధంగా కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎం మోహన్, నాయకులు ఈశ్వర్ యాదవ్, సుభాన్ వలి, వీరేంద్ర, రాజేష్ తదితరులు పాల్గోన్నారు.