ఆదోని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి

ఆదోని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
పి.కోదండ, గౌరవ సలహాదారులు దస్తగిరి నాయుడు,
ఆదోని ప్రతినిధి, ఏప్రిల్ 25, (సీమ కిరణం న్యూస్) :
ఆదోని జిల్లా సాధన కమిటీ కన్వీనర్ పి.కోదండ, గౌరవ సలహాదారులు దస్తగిరి నాయుడు,బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో మంగళ ఆంజనేయ స్వామి దేవాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదోని ఆదోని రెవెన్యూ డివిజన్ ను జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటాము. ప్రకటించడం అయినది.అలాగే ఆదోని అభివృద్ధి పైన, సమస్యల పైన న చర్చిస్తూ అందులో భాగంగా ప్రధానంగా ఆరు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోరడమైనది.
ప్రధానమైన సమస్యలు : –
1. ఆదోని ఏరియా అథారిటే డెవలప్మెంట్ బోర్డ్ కి ఆదోని అభివృద్ధి పాలక మండలి ఏర్పాటు చేయాలి.
2. మంచినీటి సమస్యను పరిష్కరించాలి.
3. కరువు, వలసల నివారణ చేపట్టాలి.
4. ఆదోనిలో విద్య,వైద్య,విధానాన్ని మెరుగుపరచాలి.
5. విద్యుత్ కరెక్టుగా పవర్ కట్ లేకుండా సరఫరా చేయాలి
6. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మరియు జూనియర్ కళాశాలలు నిర్మించాలి.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు, బి డి ఎస్ సి యఫ్ నాయకులు రమేష్, బీసీ ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ సాయి బాబు, డివిజన్ సెక్రెటరీ పి.షేక్షావలి, మాల మహానాడు కుంకనూరు వీరేష్ నల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.