ఎమ్మెల్యే సహకారంతో చెరువుల అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సహకారంతో రూ 36.39 కోట్లతో చెరువుల అభివృద్ధి పనులు
సింగల్ విండో మాజీ అధ్యక్షులు చెన్నంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి
తుగ్గలి, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ సహకారంతో మండలంలో రూ 36 కోట్ల 39 లక్షల రూపాయలతో చెరువులలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి అని వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ అధ్యక్షులు సింగల్ విండో అధ్యక్షులు చెన్నంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారము చెన్నంపల్లి గ్రామంలోని చెరువులలో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు .ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ జొన్నగిరి గ్రామం లోని చెరువులో అభివృద్ధి పనులు ప్రారంభించడంతో అన్ని చెరువుల లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రస్తుతం సోమవారం చేన్నంపల్లి చెరువులో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. తుగ్గలి మండలం లోని రైతుల అభివృద్ధికి ఈ పనులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అతి త్వరలో ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ సహకారంతో చెరువులకు హంద్రీనీవా నీళ్లు రావడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగిందన్నారు. త్వరలో పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే చెరువులకు హంద్రీనివా నీరు రావడం జరుగుతుందన్నారు. పత్తికొండ నియోజకవర్గం లో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సహకారంతో అనేక అభివృద్ధి పనులు జరిగాయని ఆయన అన్నారు . మండలం లో చెరువుల అభివృద్ధి పనులు చేసేందుకు 36 కోట్ల 39 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ కు మండల ప్రజలంతా రుణపడి ఉంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు రామిరెడ్డి ,సురేష్ రెడ్డి ,వైయస్సార్ సిపి నాయకులు బొందిమడుగుల ఈశ్వర్ రెడ్డి ,స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు కాకర్ల హరిచంద్ర ,తిమ్మాపురం కొండయ్య ,రంజాన్వలి, నల్లబోతుల వెంకటేశ్వర్లు, ఎద్దులదొడ్డి హరిజన రంగస్వామి, విద్యా కమిటీ చైర్మన్ నాగన్న తదితరులు పాల్గొన్నారు.