సీసీ కెమెరాలతో నేరాల కట్టడి
సీఐ వేణుగోపాల్ రెడ్డి
నెల్లూరు, ఆత్మకూరు, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్):
ఆత్మకూరు పట్టణాన్ని పూర్తిస్థాయిలో సిసి కెమెరాల పర్యవేక్షణ జరిపేందుకు పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకుందామని సిసి కెమెరాల ద్వారా నేరాలు కట్టడి చేయవచ్చని ఆత్మకూరు సిఐ జి.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఆయన ఆత్మకూరు పట్టణంతోపాటు ప్రధానంగా నెల్లూరు పాలెం సెంటర్లో జాతీయ రహదారిపై ఐదు వైపుల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి పనితీరును ఆదివారం స్థానిక ఎస్ఐ శివ శంకర్ రావు తో కలిసి పరిశీలించారు.. ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు పోలీస్ స్టేషన్ కంప్యూటర్ కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని ఎవరైనా నేరాలకు పాల్పడితే వెంటనే వారిని పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని సీఐ తెలిపారు. .స్థానికుల సహకారంతో నేర పరిశోధనకు ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆత్మకూరు పోలీసులు చూపినా చొరవకు స్థానికులు అభినందిస్తున్నారు.. త్వరలో ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలలో పూర్తిస్థాయిలో సిసి కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ చేపడతామని ఆయన తెలిపారు.. సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారస్తులు ముందుకు వచ్చి పోలీసులకు సహకరించడం అభినందించదగ్గ విషయమని సీఐ అన్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.