విద్యార్థుల సమస్యలపై పోరాడుదాం
ఆర్. వై. ఎస్. ఎఫ్. రాష్ట్ర అధ్యక్షుడు రంగముని నాయుడు
విద్యార్థుల సమస్యలపై పోరాడుదాం:
ఆర్. వై. ఎస్. ఎఫ్. రాష్ట్ర అధ్యక్షుడు రంగముని నాయుడు
ఎమ్మిగనూరు , ఏప్రిల్ 25 , ( సీమకిరణం న్యూస్ ) :
స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్. వై. ఎస్. ఎఫ్ విద్యార్థి సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్.ఎఫ్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రంగముని నాయుడు హాజరు కావడం జరిగింది . అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చదువుకున్నటువంటి యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది యువత రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఆర్. వై. ఎస్. ఎఫ్ విద్యార్థి సంఘం లక్ష్యమని అన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి జరగబోయే పరీక్షలకు విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆర్. వై. ఎస్ . ఎఫ్ విద్యార్థి సంఘం ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని అన్నారు.
నూతన కమిటీ ఎన్నిక :-
ఈ ముఖ్య సమావేశంలో నూతనంగా తాలూకా కమిటిని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో తాలూకా అధ్యక్షుడిగా రాముడు ప్రధాన కార్యదర్శిగా తిమ్మరాజు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నరసన్న ఉపాధ్యక్షుడిగా పూర్ణ కార్యదర్శులుగా షేక్షావలి, రాముడు మరో ఎనిమిది మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: హనుమంతు, మహేంద్ర, మల్లికార్జున, కలందర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.