స్పందన అర్జీలు తక్షణమే పరిష్కరించండి
జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి
రెవెన్యూ అంశాలలో నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించండి
స్పందన అర్జీలు తక్షణమే పరిష్కరించండి
జగనన్న స్మార్ట్ టౌన్ హౌసింగ్ స్కీమ్ కింద MIG ప్లాట్లకు భూములు గుర్తించండి
జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
నంద్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :-
జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద భూముల రీ సర్వే, పిఓఎల్ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించి పెండింగులో వున్న భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ అన్ని మండలాల తాసిల్దార్ లను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అంశాలపై అన్ని మండలాల తాసిల్దారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, ల్యాండ్ అండ్ సర్వే ఎడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తిచేయాలని అన్ని మండలాల తాసిల్దార్ లను ఆదేశించారు. పిఓఎల్ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించి పెండింగులో వున్న భూసేకరణను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రైతుల నుండి నీటి పన్ను వసూళ్లు చేయడంలో వెనుకబడి వున్నామని డిమాండ్ పై మ్యాపింగ్ అయిన వాటికి ఆన్లైన్ ద్వారా నోటీసులు జారీ చేసి నీటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద వన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బండి ఆత్మకూరు, బేతంచర్ల, చాగలమర్రి, దొర్నిపాడు, గడివేముల తదితర మండలాల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్, డిజిటల్ సైన్ తదితర పెండింగ్లో ఉన్న అంశాలపై దృష్టి సారించి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ముద్రలో ఏవైనా టెక్నికల్ సమస్యలు వస్తే హౌసింగ్ ఎఈలతో కోఆర్డినేట్ చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైల్వే, ఆర్అండ్బి, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటి నిర్మాణం కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హతగల లబ్ధిదారులకు 90 రోజుల్లో ఇంటి పట్టాల మంజూరు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హైకోర్టు, హెచ్ఆర్ సి, లోకాయుక్తలలో వున్న కోర్టు కేసులను ప్రాధాన్యతగా తీసుకుని నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన కేసులకు సంబంధించిన ఆధారాలతో నిర్దేశిత గడువులోగా సంబంధిత కోర్టుల్లో కౌంటర్ వేయాలని మండల తాసిల్దార్లను ఆదేశించారు. స్పందన అర్జీల పరిష్కారంలో 24 గంటల్లో పరిష్కరించేవి, 48గంటల్లో పరిష్కారం చూపే డేటాను ఆన్లైన్లో ఉంచామని మండల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్లకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నెల 30 తారీఖున పౌర హక్కుల దినోత్సవం జరిపేందుకు సంబంధిత మండల తాసిల్దార్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతోపాటు రెవెన్యూ అంశాల పై కూడా పూర్తి స్థాయి దృష్టి సారించి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ హౌసింగ్ స్కీమ్ కింద MIG ప్లాట్లకు మున్సిపల్ పట్టణాల్లో భూములను గుర్తించాలని నంద్యాల, ఆత్మకూరు, డోన్ ఆర్డిఓలు సంబంధిత మండల తాసిల్దార్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో నంద్యాల ఆర్డీఓ శ్రీనివాసులు, డోన్ ఆర్డీఓ వెంకటరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ ఎం. దాసు, 29 మండలాల తాసీల్ధార్లు ఆయా మండల కార్యాలయాల నుండి పాల్గొన్నారు.