నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి : సిపిఎం
నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి : సిపిఎం డిమాండ్
డోన్ టౌన్, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్కిస్ట్, సిపిఎం ) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చారు, అందులో భాగంగా డోన్ పట్టణంలోని కొండపేట 6వ సచివాలయం ముందు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు SA రహీమాన్ అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి కోయలకొండ నాగరాజు, మోటార్ వర్క్స్ యూనియన్ కార్యదర్శి టీ. శివరాం, లు మాట్లాడుతు పన్నుల మీద పన్నులేసి పెట్రోలు, డీజిల్, గ్యాస్, విద్యుత్, బస్సు చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేయడం సిగ్గుచేటని, ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకుల ధరలు ఆకాశన్ని అంటాతున్నాయని వారు అన్నారు, కేంద్రం కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తు వారికిచ్చిన రుణాలను మాపి చేస్తు వారికి అనుకూలమైన పరిపాలన చేస్తున్నారని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజం ఎత్తరు, కేంద్రం సెస్, సర్ చార్జీలు, పెట్రోలియంపై సుంకం తగ్గించి ప్రజలపై వేసిన బారాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము, పన్నులను రద్దుచేసి దేశంలో ఎక్కడలేని విదంగా మన రాష్ట్రంలోనే ఉన్నాయని అవి ఆకాశంలో పక్షుల్లా ఎగురుతున్నాయని, వాటిని సమాన్యమైన ప్రజలు కొని తినే పరిస్థిలో లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు, పిల్లి పాలు తాగుతు నన్నెవరు చూడలేదనే రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని వారు అన్నారు, ఉపాధి హామీ పనిదినాలు 300రోజులకు పెంచి కూలీలకు ఉపాధిచుపించాలని, అసంగటితే కార్మికులకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, పెట్రోల్, డిజల్ జిఎస్టి పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము, ఎవ్వరైతే మీకు అధికారం అప్పాజెప్పారో వారే జరగబోయే రోజుల్లో అధికారం ఉడగొట్టడానికి సిద్దంగా ఉన్నారని వారు తెలిపారు, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాలని, లేని పక్షాన ప్రజలను చైతన్య పరచి ప్రజా ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు, ధర్నా తదనంతరం సచివాలయం అధికారిగారికి డిమాండ్ల తో కూడిన వినతిపత్రం ఇవ్వడమైంది, ఈకార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నాగన్న, కులుషంబీ, దేవి, సుధాకర్, ఎర్రన్న, వెంకటేశ్వర రెడ్డి, సూరన్న, బాలు, మద్దయ్య, మనోహర్, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.