ద్రోణాచలం సేవాసమితి ఆధ్వర్యంలో 55వ అంత్యక్రియలు

ద్రోణాచలం సేవాసమితి ఆధ్వర్యంలో 55వ అంత్యక్రియలు
డోన్ టౌన్, ఏప్రిల్ 25, (సీమ కిరణం న్యూస్) :
బ్రతుకుబండి ఎలా సాగినా మరణం ఎవ్వరినీ అనాధలుగా మిగిల్చకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది ద్రోణాచలం సేవా సమితి. ఈ క్రమంలో నిన్నరాత్రి డోన్ మాలిక్ బాబా గుడి దగ్గర మరణించిన గుర్తు తెలియని ఒక వ్యక్తి దేహానికి “ద్రోణాచలం సేవా సమితి” సభ్యులు అండగా నిలిచి ఈ ఉదయం తమ సేవా సమితి 55వ ఆత్మబంధువు గా స్వీకరించి అన్నీ తామై నిలబడి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన సేవా సైనికుడు ఫయాజ్ గారి మిత్రులు కొండపేట లో కిరాణం షాప్ యజమాని రవీంద్రనాథ్ ఈ పుణ్య కార్యానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరించారు.(ద లాస్ట్ జర్ని)వైకుంఠ రథం రాజయ్య గౌడ్ సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచలం సేవా సమితి సభ్యులు షాదీఖానా రాజా,గురుస్వామి,శేఖర్ రెడ్డి, పానీపూరి మురళి, తాహేర్, రసూల్,ఆటో దాదా,డిస్కో నూర్ భాషా, డోన్ టౌన్ పోలీసులు గురునాథ్,రామ మూర్తి లు పాల్గొన్నారు.