పారిశుద్ధ్య కార్మికుడికి ఘన సన్మానం

పారిశుద్ధ్య కార్మికుడికి ఘన సన్మానం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండలం అనుమసముద్రంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య0 ఊపిరిగా భావించి నిత్యం రోడ్లపై సంచరిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టే పారిశుద్ధ్య కార్మికుడయినటువంటి జీ.రవి ని సోమవారం సచివాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయనకు శాలువా పూలమాలతో సత్కరించి కొంత నగదును స్వీట్ బాక్స్ ను అందజేశారు ఈ సన్మాన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్ నరసయ్య , ఏఎస్ పేట గ్రామ సర్పంచ్ భర్త ఎస్.కే. జిలాని భాష మండల వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ షేక్ షబ్బీర్ గ్రామ విఆర్ఓ లు కే.రమణయ్య సి హెచ్ మీరావలి గ్రీన్ గాడ్ సయ్యద్ మహమ్మద్ రఫీ, వెల్ఫేర్ అసిస్టెంట్ రామనారాయణ రెడ్డి గ్రామ నాయకులు సచివాలయ సిబ్బంది వాల్ ఎంట్రీలు పాల్గొన్నారు.