
స్పందన ఫిర్యాదుదారులకు భోజన ఏర్పాట్లు
సిఐ పని తీరుపై ప్రశంసలు
నెల్లూరు, ఆత్మకూరు, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
ప్రతి సోమవారం ఫిర్యాదుల దినోత్సవం స్పందన తమ సమస్యలతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చే ఫిర్యాదు దారులకు మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేయాలంటూ జిల్లా ఎస్పీ సిహెచ్ విజయ రావు ఇచ్చిన ఆదేశాలతో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దారులకు భోజన ఏర్పాట్లను ఆత్మకూరు పోలీసులు సోమవారం చేశారు వారి సమస్యలతో వినతిపత్రం ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చే వృద్ధులు,పిల్లలు,మహిళలకు మధ్యాహ్నం వేళ లో భోజన వసతి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో జిల్లా ఎస్పీ సిహెచ్ విజయ రావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ జి.వేణుగోపాల్ రెడ్డి, స్థానిక ఎస్ఐ ఎం.శివ శంకర్ రావు లు స్టేషన్ వద్దకు వచ్చిన ఫిర్యాదు దారులకు భోజన ఏర్పాటు చేసి దగ్గర ఉండి వడ్డించి వారితో పాటు కలిసి భోజనం చేశారు పోలీస్ స్టేషన్ వద్దకు తమ సమస్యలతో ఫిర్యాదు చేయడానికి వచ్చిన తమకు భోజన వసతి ఏర్పాటు చేయడంతో పాటు తమతో కలిసి పోలీసులు కూడా భోజనం చేయడంపై స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తపరిచారు.. ఈ భోజన ఏర్పాటులో స్టేషన్ సిబ్బంది పాలుపంచుకున్నారు జిల్లా ఎస్పీ ఆదేశాలను ఆత్మకూరు సిఐ వేణుగోపాల్ రెడ్డి తమదైన శైలిలో పాటిస్తూ పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటిస్తూ ప్రజలకు ఫిర్యాదు దారులకు దగ్గరయ్యేవిధంగా అడుగులు వేయాలంటూ సిబ్బందికి సూచిస్తూ సిఐ చేస్తున్న కార్యక్రమాల పట్ల సర్కిల్ పరిధిలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.