త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి
త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి
కోసిగి, ఏప్రిల్ 23, (సీమకిరణం న్యూస్ ) :
కోసిగి మండలంలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా గ్రామాల్లో నీటిసమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి అన్నారు.శనివారం ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని డొడ్డిబెళగల్ గ్రామంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై యస్ ఐ ధనుంజయ,పంచాయతీ కార్యదర్శి పరుశురాం,వీఆర్వో బసవరాజు మరియు గ్రామ పెద్దలతో సమీక్షించారు. జలజీవన్ మిషన్ క్రింద దొడ్డి గ్రామానికి 32.42లక్షలతో, బెళగల్ గ్రామానికి 25.99 లక్షలతో ఇంటిఇంటికి త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని,త్వరలోనే అందరికీ త్రాగునీటి కోరత తీరనున్నదని,ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పెద్దలకు సూచించారు.గ్రామాభివృద్దికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎప్పుడూ ముందుంటాడని, అందరూ సహాకారంతో గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో దొడ్డి నర్సన్న,యంపీటీసి వీరేష్, రవిగౌడ్,వీరన్నగౌడ్, మల్లికార్జునరెడ్డి,చంద్ర, బజారి,లక్ష్మయ్య,టి.నర్సప్ప మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.