
చిరమనలో ప్రపంచ మలేరియా దినోత్సవం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏఎస్ పేట మండలం చిరమన గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, స్కూల్ విద్యార్థులు తో కలిసి మలేరియా పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ఈ సందర్భంగా చిరమన పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రహమతునిసా బేగ0 మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలని, ప్రజలు తమ తమ గ్రామాలను తమ తమ ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, దోమతేరాలు వాడాలని, జ్వరం వచ్చిన పిదప రక్తపు పరీక్షలు పి హెచ్సి ఉపకేంద్రములో చేయించుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్యపరంగా పలు సలహాలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి షఫీ, ఆరోగ్య పర్యవేక్షకులు వి. సలోమి ,చిరమన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.