ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ
నెల్లూరు, ఆత్మకూరు, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఆర్ రాకేష్ ఆధ్వర్యం లో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా దోమల ద్వారా వచ్చు మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, ఫైలేరియా వ్యాధులకు గురి కాకుండా తీసుకును జాగ్రత్తల గురించి తెలుపడమైనది. ప్రతి శుక్రవారం డ్రైడే-ఫ్రైడే గా పాటించి ఇంటిలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలపడ మైనది. గ్రూప్ మీటింగ్ నిర్వహించి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించడమైనది. దోమలు లార్వా నియంత్రణలో భాగంగా ఇళ్ల వద్ద ఉన్న మురికి కాలువల్లో మడ్డి ఆయిల్, కిరోసిన్ వేయడం ద్వారా లార్వా చనిపోతుంది అని తెలుపడమైనది. వైద్యపరంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగిందని డాక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సబ్ యూనిట్ అధికారి షేక్ ఖాదర్ భాష , ఎస్.సుధాకర్ ఎంపి హెచ్ ఎస్, ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..