
ఏకాగ్రతతో సాధన చేస్తే విజయం మీ సొంతం
డాక్టర్ బి. శంకర్ శర్మ
కర్నూలు స్పోర్ట్స్, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
విలువిద్య క్రీడాకారులు ఏకాగ్రతతో సాధన చేస్తే విజయాలు మీ సొంతం అవుతాయి డాక్టర్ బి శంకర్ శర్మ అన్నారు. సోమవారం స్థానిక బీకాం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విలువిద్య ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా డాక్టర్ శంకరశర్మ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విలువిద్య అండర్ 10,12,14 జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించిన విజయాలతో రావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విలువిద్యా సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య,జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి సునీల్ కుమార్,జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి వంశీకృష్ణ,విశ్రాంత ఉపాధ్యాయులు చల్ల చిట్టిబాబు,సీనియర్ క్రీడాకారులు విష్ణు తదితరులు పాల్గొన్నారు.