లబ్దిదారులకు జీవనోపాధులు కల్పించే దిశగా చర్యలు
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మరింత ప్రగతి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి :
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్,29, (సీమకిరణం న్యూస్) :
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మరింత ప్రగతి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మత్స్యశాఖ, వ్యవసాయ, హార్టికల్చర్, మార్కెటింగ్, మార్క్ ఫెడ్ కు సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాలు సాధించడానికి వారాల వారీగా టార్గెట్ పెట్టుకొని పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. క్యాలెండర్ ను రూపొందించుకొని మునుపటి కన్నా పనులలో పురోగతిని సాధించాలన్నారు. ..జిల్లాలో మల్బరీ సాగు ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా లబ్దిదారులకు జీవనోపాధులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మత్స్యకార శాఖ ఫిషరీస్ డిడి శ్యామల దేవి, వ్యవసాయ శాఖ జేడిఎ పి.ఎల్.వరలక్ష్మి, పశుసంవర్ధక శాఖ, ఏపీఎంఐపీ పిడి ఉమాదేవి, వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక, మార్క్ ఫెడ్, కోఆపరేటివ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.