ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు

ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలా సచివాలయ వ్యవస్థ పని చేయాలి
ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి
సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 29, (సీమకిరణం న్యూస్) :
సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కర్నూలు నగరంలోని రోజా వీధి – 1, రోజా వీధి – 2 వార్డు సచివాలయం నెం. 123 మరియు వార్డు సచివాలయం నెం. 124లను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికలు, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు అందించే సేవలను గడువు లోపు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు అందుతున్న పథకాల తీరు, సమస్యల పరిష్కారానికి సిటిజన్ ఔట్ రిచ్ కార్యక్రమం కూడా జరగాలని జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.. మొక్కుబడిగా కాకుండా చిత్త శుద్ధితో ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఫిర్యాదులు రాకుండా జాగ్రతగా పని చేయాలన్నారు..సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది తాము సక్రమంగా పని చేయడంతో పాటు తమ పరిధిలో ఉన్న వాలంటరీ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసేలా చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు వన్టైమ్ సెటిల్మెంట్ కింద లబ్ధిదారులు అందరికీ డాక్యుమెంట్లను అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ కార్డ్ లో సభ్యుల చేర్పు గురించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు